నేటి నుంచి ఎన్నికల కోడ్
ఏపీ ఎన్నికల అధికారి
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించడంతో ఏపీలో హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ఇవాల్టి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతుందన్నారు. 46 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఫామ్ 12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకుని ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. 85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు ముఖేష్ కుమార్ మీనా.
ఒక వేళ ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించొచ్చని వెల్లడించారు. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 18 నుంచి 25 వరుకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 26న నామినేషన్లు పరిశీలిస్తామని పేర్కొన్నారు.