NEWSANDHRA PRADESH

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Share it with your family & friends

విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ హెచ్చ‌రిక

అమ‌రావ‌తి – ఏపీని మ‌రోసారి వ‌ర్షాలు ముంచెత్త‌నున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇప్ప‌టికే హెచ్చ‌రిక జారీ చేసింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. ఈ సంద‌ర్బంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం స‌మీక్ష చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షించారు.

భారీ వర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు సీఎస్. పోలిసు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు అలెర్ట్ గా ఉండాల‌ని సూచించారు.

ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాల‌ని సూచించారు.

ఈదుర గాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు ప్రభావంతో పొంగి పొర్లే రోడ్లు వెంటనే మూసి వేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.

శిధిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండే వారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలని పేర్కొన్నారు. అర్బన్ ఫ్లడ్ వలన రోడ్ల మీద నీళ్ళు నిలవకుండా ముందుగానే డ్రైనేజి, నాళాలు శుభ్రం చేయాలని ఆదేశించారు.

కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు నీటి పారుద‌ల శాఖ ప‌ర్య‌వేక్షించాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్.