నమోదు చేసిన సీఐడీ పోలీసులు
అమరావతి – ప్రముఖ నటుడు, వైసీపీ నేత, మాజీ ఏపి ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. ఉద్దేశ పూర్వకంగా పోసాని మురళీ కృష్ణపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ సీఐడీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఏపీలో గత వైసీపీ పాలించిన ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి చెందిన మంత్రులు, సీనియర్లు, నేతలు తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు, లోకేష్ , బ్రాహ్మణి, బాలకృష్ణ, భువనేశ్వరి, తదితరులను టార్గెట్ చేశారు. ఆపై అనరాని మాటలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చి పోయారు.
వారిలో పోసాని కృష్ణ మురళితో పాటు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆలీ కూడా ఉన్నారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు వైసీపీని. అధికారాన్ని కోల్పోవడంతో కేసుల పరంపర మొదలైంది వైసీపీ నేతలపై. ఇందులో భాగంగానే ఇవాళ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు కావడం గమనార్హం.