చంద్రబాబుకు సీఐడీ షాక్
ఫైబర్ నెట్ కేసులో ఛార్జ్ షీట్
అమరావతి – ఏపీ సీఐడీ మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో లింకు ఉందంటూ పేర్కొంది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఏసీబీ కోర్టులో పూర్తి వివరాలు సమర్పించింది. ఏ-1గా నారా చంద్రబాబు నాయుడు, ఏ2గా వేమూరి హరికృష్ణ పేర్లు చేర్చింది. ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడిపై ఎనిమిది కేసులు నమోదు చేసింది ఏపీ సీఐడీ.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి , నారాయణ సంస్థల చైర్మన్ నారాయణ, నారా లోకేష్ ను కూడా చేర్చింది. ఇదే సమయంలో ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. ఈ మేరకు కోర్టు రిమాండ్ విధించింది.
రాజమండ్రి జైలులో 53 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని రద్దు చేసింది. దీంతో సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు భారీ ఊరటను ఇచ్చింది.