వైసీపీ ఎన్నారై విభాగాల నియామకం
సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకు
అమరావతి – అనంతపురం జిల్లా రాప్తాడు లో చేపట్టిన సిద్ధం బహిరంగ సభకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. దాదాపు 12 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినట్లు ప్రాథమిక అంచనా. ఇది ఓ రికార్డు. ఈసారి కూడా వై నాట్ 175 అనే ట్యాగ్ లైన్ తో ముందుకు వెళుతున్నారు జనగ్ రెడ్డి.
ఇదిలా ఉండగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం. వివిధ దేశాలకు చెందిన ఎన్ ఆర్ ఐ విభాగాలపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా విభాగాలను ఏర్పాటు చేసినట్లు వైసీపీ సోమవారం కీలక ప్రకటన చేసింది.
ఇందులో భాగంగా వైసీపీకి చెందిన వారిని ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, యురోపియన్ యూనియన్, జీసీసీ (గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్), కువైట్, మలేషియా, న్యూజిలాండ్, ఖతార్, సింగపూర్, యూఏఈ, యూకే దేశాల ఎన్ఆర్ఐ విభాగాల్లో పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులను వివిధ పదవుల్లో నియమించారు.
ప్రపంచ వ్యాప్తంగా పార్టీ కోసం పని చేస్తున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత బలంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు జగన్ మోహన్ రెడ్డి.