కఠినంగా ఉండాలని దిశా నిర్దేశం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో తన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్బంగా మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య మంత్రి అనిత వంగలపూడి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
అంతే కాకుండా కొంత మంది అధికారుల తీరు పైనా మంత్రులతో ప్రస్తావించారు సీఎం. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తీరు మారక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాంటి అధికారుల తీరుతోనే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మంచిగా ఉండడంలో తప్పు లేదని, కానీ పరిపాలనా పరంగా మెతక వైఖరితో ఉండ కూడదన్నారు. అంతే కాదు మంత్రులు తమ పనితీరు మార్చు కోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.
మంత్రుల పనితీరు మెరుగు పరుచు కోవాలని అన్నారు.. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదన్నారు సీఎం.