Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీలో ప్రీమియ‌ర్ లా యూనివ‌ర్శిటీ

ఏపీలో ప్రీమియ‌ర్ లా యూనివ‌ర్శిటీ

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం సీఎంతో భేటీ

అమ‌రావ‌తి – ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో దేశంలో ఎక్క‌డా లేని విధంగా కొత్త‌గా ప్రీమియ‌ర్ లా విశ్వ విద్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు బీసీఐ బృందానికి.

శుక్ర‌వారం నారా చంద్ర‌బాబు నాయుడును స‌చివాల‌యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మ‌న్ , సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌న‌న్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని న్యాయ‌వాదుల బృందం క‌లిసింది. ఈ సంద‌ర్బంగా సీఎం, చైర్మ‌న్ మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి.

భారతదేశంలో న్యాయ విద్యను మరింత ఉన్నతీ కరించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తూ, BCI ట్రస్ట్ PEARL FIRST, NLSIU, బెంగళూరు, IIULER, గోవా తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రీమియర్ విశ్వ విద్యాలయాన్ని స్థాపించాలని ప్రతిపాదించింది.

ఈ కొత్త సంస్థ ప్రపంచ స్థాయి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు సీఎం. అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా ఉన్నత విద్య, న్యాయ రంగంలో , అనుబంధ రంగాలలో నైపుణ్య‌ అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా.

RELATED ARTICLES

Most Popular

Recent Comments