బాబు ఔదార్యం వికలాంగురాలికి సాయం
రూ. 5 లక్షల సాయం..నెల నెలా పెన్షన్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఔదర్యాన్ని చాటుకున్నారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రక్షాళన ప్రారంభించారు. వివిధ శాఖలను సమీక్షించారు. పలువురు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.
ఇదే సమయంలో తనను కలిసిన బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన ఆరుద్రకు, అనారోగ్యం కారణంగా దివ్యాంగురాలైన ఆమె కూతురుకు ఏపీ సీఎం ధైర్యం చెప్పారు.
మానవతా దృక్ఫథంతో అండగా నిలిచారు. ఏకంగా ఆమెకు ఆసరాగా ఉండేందుకు గాను తక్షణ సాయంగా రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ప్రతి నెల నెలా రూ. 10 వేలు పెన్షన్ కింద అంద జేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం అవుతోంది.