సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆర్థికంగా చితికి పోయిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నామని వాపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక పోతున్నామన్నారు. నిలదొక్కుకునేంత వరకు తమకు చేయూత ఇవ్వాలని కోరారు సీఎం. గోదావరి నుండి బనకచర్ల దాకా నదులను అనుసంధానం చేస్తున్నామన్నారు.
ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ చేయలేమన్నారు. మోడీ స్ఫూర్తితో 2047 కి స్వర్ణాంధ్ర సాధించాలని అన్నారు చంద్రబాబు నాయుడు. సూర్య ఘాట్ లాంటి కేంద్ర పథకాలు మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పారు . గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అమిత్ షా సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ ఇస్తామన్నారు సీఎం. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు. కేంద్రం అందించిన ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ రాష్ట్రానికి వరం లాంటిదన్నారు. గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు .