బాబు బక్రీద్ శుభాకాంక్షలు
రాగ ద్వేషాలకు అతీతం
అమరావతి – దేశ వ్యాప్తంగా ఇవాళ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు. ముస్లింలకు ఇది ప్రీతి పాత్రమైన పండుగ. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ముస్లిం సోదర సోదరీమణులకు కంగ్రాట్స్ తెలిపారు. స్వార్థం, అసూయ, రాగ ద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమం అన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారని పేర్కొన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ గుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.