చంద్రబాబు..పవన్ కళ్యాణ్ కంగ్రాట్స్
ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ పవర్ లోకి రావడంతో కమలం శ్రేణులు సంబురాల్లో మునిగి పోయాయి. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ గెలుపు మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయే కూటమి దేశ వ్యాప్తంగా ఇదే విజయాన్ని నమోదు చేస్తుందన్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 47 స్థానాలలో విజయ కేతనం ఎగుర వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.
ఆప్ చీఫ్ , మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ . ప్రజా తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు.