ఏపీలో ప్రజా పాలనకు శ్రీకారం
గనులు..ఎక్సైజ్ శాఖలపై సమీక్ష
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గనులు..ఎక్సైజ్ శాఖలపై సీఎం సమీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందచేస్తామని చెప్పారు.
అత్యంత కీలకమైన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు తనకు కేటాయించడం ఒక గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమర్ధవంతంగా పని చేసి, వాటి ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చడానికి శాయ శక్తులా కృషి చేస్తానని చెప్పారు.
వెలగపూడి సచివాలయం మూడవ భవనం మొదటి అంతస్థులో కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేసి, మద్యం లావాదేవీలు, డిస్టిలరీల నుంచి పంపిణీ అత్యంత పారదర్శకంగా అమలు జరిపేందుకు, అక్రమ ఇసుక రవాణాను నియంత్రించి, ప్రజావసరాల కనుగుణంగా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.