బిల్ గేట్స్ తో చర్చలు సఫలం
దావాస్ – సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటన అద్భుతంగా జరిగిందని, భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. ఈ సందర్బంగా ఏపీలో తాము ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్శిటీకి సహకారం అందించాలని తాను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కోరడం జరిగిందని చెప్పారు. ఆయనతో చాలా కాలం తర్వాత భేటీ కావడం, తాను చేసిన ప్రతిపాదనకు బిల్ గేట్స్ ఓకే చెప్పడం సంతోషం కలిగించిందన్నారు.
అమెరికా వెలుపల మైక్రోసాఫ్ట్ మొట్ట మొదటి అభివృద్ది కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేలా చేశానని, అది ఇప్పుడు నగరాన్ని ఐటీకి కేరాఫ్ గా మార్చేసిన విషయం గురించి బిల్ గేట్స్ తో పంచుకున్నానని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాబోయే భవిష్యత్తు అంతా ఏఐదేనని పేర్కొన్నారు. అన్ని రంగాలలో కీలకమైన మార్పులు రానున్నాయని తెలిపారు.
ఏపీ 2047 విజన్ గురించి ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ కు తెలియ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్దికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరానని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్శిటీ సలహా బోర్డులో చేరాలని సూచించానని తెలిపారు.