పవన్ నిండు నూరేళ్లు వర్దిల్లాలి – సీఎం
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాబు
అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినో రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఓ వైపు రాష్ట్రంలో వరదలు ఉధృతంగా కురుస్తున్నా అలుపెరుగని రీతిలో పని చేస్తున్నారు సీఎం.
ఈ సందర్భంగా తన తోటి కేబినెట్ సహచరుడైన పవన్ కళ్యాణ్ కు జన్మదిత్సవ శుభాభినందనలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజా జీవితంలో నిబద్ధతతో ఉండే నాయకుడిగా ఆయన మరిన్ని మైలు రాళ్లు దాటాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
చలన చిత్ర సీమలో తిరుగులేని కథానాయకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రశంసించారు సీఎం.
రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.