Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHజమిలి వ‌చ్చినా 2029 లోనే ఎన్నికలు

జమిలి వ‌చ్చినా 2029 లోనే ఎన్నికలు

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

జ‌మిలి అమ‌లులోకి వ‌చ్చినా ఎన్నిక‌లు జ‌రిగేది 2029లోనేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు నాయ‌డుఉ. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తాము మద్దతు ప్రకటించామ‌ని చెప్పారు.
వైసీపీ పబ్బం గడుపు కోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందంటూ మండిప‌డ్డారు. వారు ప్ర‌జ‌ల్లో విశ్వ‌సీన‌య‌త కోల్పోయార‌ని అన్నారు.

శ‌నివారం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలని అన్నారు సీఎం.

విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా చంద్రబాబు నాయుడు. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయని అన్నారు.
2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదన్నారు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలని కోరారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జ‌రుగుతాయంటూ ప్ర‌క‌టించారు.

ఈసారి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామ‌న్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో నిర్వహిస్తామ‌ని చెప్పారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చ అంశాలు పంపి సమాధానాలు కోరతామ‌న్నారు.

ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments