NEWSANDHRA PRADESH

బాధితుల ఆవేద‌న చంద్ర‌బాబు ఆలంబ‌న

Share it with your family & friends

పెద్ద ఎత్తున రాజ‌ధాని..అమ్మ క్యాంటీన్ల‌కు విరాళాలు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. మూడు గంట‌ల‌కు పైగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఏక‌రువు పెట్టారు. వారంద‌రికీ తాను ఉన్నానంటూ హామీ ఇచ్చారు.

ప్ర‌ధానంగా గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న ఇబ్బందుల గురించి ఎక్కువ‌గా ఫిర్యాదులు చేశారు. అక్ర‌మ కేసుల నుండి విముక్తి క‌ల్పించాల‌ని కోరారు. త‌మ భూముల‌ను క‌బ్జా చేశార‌ని , వాటిని విడిపించాల‌ని విన్న‌వించారు సీఎం చంద్ర‌బాబు నాయుడుకు.

సీఎంను క‌లిసేందుకు 5 వేల మందికి పైగా బాధితులు చేరుకున్నారు. వారి సాధ‌క బాధ‌కాలు విన్నారు. శ్రీకాకుళం జిల్లా, సారవకోట మండలం బొంతు, మహాసింగి గ్రామస్తులు…తమకు చెందిన 47 ఎకరాల వ్యవసాయ భూమిని బొంతు గ్రామ వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని, తిరిగి ఆ భూములు తమకు అప్పగించాలని కోరారు.

వైసీపీ నేత కిరణ్ అడిగిన ధరకు తమ భూమి విక్రయించనందుకు అక్రమ కేసులు పెట్టి వేధించారని అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నగిరిపాడుకు చెందిన మాచినేని మోహన్ రావు సీఎంకు మొర పెట్టుకున్నారు.