ఏపీ సీఎం ప్రజా దర్బార్
ఆర్జీలు స్వీకరించిన బాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ఆయన శనివారం మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎప్పటి లాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కరానికి హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆర్జీలు వచ్చాయి. సీఎంను కలిసేందుకు బారులు తీరారు బాధితులు. ఈ సందర్బంగా గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తమను ఇబ్బందులకు గురి చేసిందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు నారా చంద్రబాబు నాయుడును.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఎవరూ ఆందోళనకు గురి కావద్దని ఈ సందర్బంగా సూచించారు సీఎం. బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల మేలు కోరుకుంటుందని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.