మూడు రోజుల పాటు అధికారిక పర్యటన
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు వెళతారు. అక్కడ భారత రాయబారితో భేటీ కానున్నారు. ఈ సదస్సులో హాజరయ్యే ప్రముఖులతో చర్చలు జరుపుతారు చంద్రబాబు నాయుడు.
విచిత్రం ఏమిటంటే ఇటు తన శిష్యుడు కొలువు తీరిన తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనుముల రేవంత్ రెడ్డి సైతం దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరు కానుండడం విశేషం. ఇద్దరూ పెట్టుబడులు ఆకర్షించేందుకే వెళుతున్నామంటూ ప్రకటించడం విశేషం.
చంద్రబాబు నిత్యం భారత దేశం కంటే సింగపూర్ ను ఎక్కువగా జపిస్తారు. ఆయన అభివృద్ది మంత్రం పూర్తిగా టెక్నాలజీ మీదనే ఉంటుంది. అంతే కాకుండా ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయం దండుగ అంటూ కామెంట్ చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. కేవలం కార్పొరేట్లు, పెట్టుబడిదారులకే ప్రయారిటీ ఇస్తారన్న అపవాదు చంద్రబాబుపై ఉంది.