ఫిబ్రవరి 1న ప్రచారం చేయనున్న సీఎం
అమరావతి – సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ పేర్కొంది. ఆయన ఫిబ్రవరి 1న ప్రచారం చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున బాబు ప్రచారం చేయనున్నారు. తెలుగు ప్రజలు అత్యధికంగా రాజధానిలో నివాసం ఉన్నారు. వారి ఓట్లను అభ్యర్థించనున్నారు.
ఇక్కడ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల జరిగిన మరాఠా ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆప్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ముచ్చటగా మూడోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తోంది.
ఇటీవలే జనరంజకమైన పార్టీ పరంగా ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. గర్భిణీలకు రూ. 21 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.
మరో వైపు ఆప్ విద్యా, వైద్య రంగానికి ప్రయారిటీ ఇస్తూ మేనిఫెస్టోను రూపొందించింది. విద్యతోనే వికాసం అలవడుతుందని పేర్కొన్నారు మాజీ సీఎం కేజ్రీవాల్. ఇక చంద్రబాబుతో పాటు పీఎం మోడీ, మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొంటారని సమాచారం.