ఒకే రోజు గురు శిష్యులు హస్తినకు
అమరావతి – సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పట్టారు. ఆయన ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరింది. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగింది. ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే మరాఠాలో జరిగిన ఎన్నికల్లో సైతం సీఎం క్యాంపెయిన్ చేశారు. విచిత్రం ఏమిటంటే తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ప్రచారం చేయడం విశేషం. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. బరిలో కాంగ్రెస్, ఆప్, బీజేపీ ఉన్నాయి. త్రిముఖ పోటీ కొనసాగుతుంది. ఈసారి గెలిస్తే ఆప్ హ్యాట్రిక్ అవుతుంది.
ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ లో భాగంగా ఇవాళ, రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 5న పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా బరిలో 699 మంది ఉన్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జనం ఆప్ ను ఆదరిస్తారా లేక బీజేపీని సమాదరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.