సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సినీ రంగంతో పాటు భారత దేశ రాజకీయాలలో చిరస్మరణీయమైన పాత్రను పోషించారని, ఆయన అందించిన సేవలకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు.
ఎన్టీఆర్ నటుడిగా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు. అతి తక్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఘనత దివంగత నందమూరి తారక రామారావుకు మాత్రమే దక్కుతుంది.
టీడీపీని పవర్ లోకి తీసుకు వచ్చేలా చేశారు. అతి తక్కు సమయంలో పవర్ లోకి వచ్చి రికార్డు సృష్టించారు. సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకంతో దేశం తన వైపు చూసేలా చేశారు. దేశ రాజకీయాలలో ఆయా పార్టీలను కలిపేందుకు కృషి చేశారు.