ఘన స్వాగతం పలికిన చైర్మన్, ఈవో
తిరుమల – ఏపీ సీఎం చంద్రబాబు తన కుటుంబీకులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, అడిషనల్ ఏవో వెంకయ్య చౌదరి. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు భార్య భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు, హెరిటేజ్ ఎండీ నారా బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ ఉన్నారు. బాబును టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, శాంతా రామ్, పి. రామ్మూర్తి, ఎస్. నరేష్ కుమార్ , ఇతర అధికారులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీ వేంకటే్శ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఇవాళ మనవడు పుట్టిన రోజు సందర్బంగా స్వామి వారిని దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా సీఎం రాక సందర్భంగా తిరుమల, తిరుపతిలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్దన్ రాజు, ఇతర అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో నూతనగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు.