స్పీడ్ పెంచిన ఏపీ సీఎం
రోజంతా సమీక్షలు..తనిఖీలు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. తనదైన శైలిలో పాలనా పరంగా పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన స్పీడ్ పెంచారు. నిత్యం తనిఖీలు, సమీక్షలతో హోరెత్తిస్తున్నారు. పని చేసే వారికి ప్రయారిటీ ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలిశారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే రూ. 1 లక్ష కోట్లు మంజూరు చేయాలని , లేకపోతే బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. దీనికి పీఎం సానుకూలంగా స్పందించారు.
చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించారు. అనంతరం భోగాపురం పనుల ప్రగతిపై సమీక్షించారు. సీ2 నేషనల్ కౌన్సిల్ సదస్సులో పాల్గొన్నారు. ఏపీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతుందని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు మొత్తంగా తనదైన పాలనతో ప్రజల ఆదరణ పొందుతుండటం విశేషం.