NEWSANDHRA PRADESH

విశాఖ ఎమ్మెల్సీపై చంద్ర‌బాబు ఫోక‌స్

Share it with your family & friends

దృష్టి సారించిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది విశాఖ‌ప‌ట్ట‌ణం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక వ్య‌వ‌హారం. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ స్థానిక సంస్థ‌ల ప‌రంగా చూస్తే వైఎస్సార్సీపీకి పెద్ద ఎత్తున సంఖ్యా బ‌లం ఉంది. ఒక‌వేళ గెల‌వాలంటే వారి మ‌ద్ద‌తు త‌ప్ప‌కుండా అవ‌స‌రం అవుతుంది.

తెలుగుదేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలతో కూడిన కూట‌మి కీల‌క భేటీ నిర్వ‌హించింది. ఎవ‌రిని త‌మ త‌ర‌పున అభ్య‌ర్థిగా నిల‌బెట్టాల‌నే దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఇదిలా ఉండ‌గా వైసీపీ బాస్ , మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూట‌మి కంటే ముందుగానే త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. మ‌రింత ఒత్తిడి పెంచేలా చేశారు.

మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా త‌మ పార్టీ త‌ర‌పున ప్ర‌క‌టించారు. ఇందుకు అంద‌రి నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

దీంతో బల‌మైన ప‌ట్టు క‌లిగిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించాలంటే ఏం చేయాల‌నే దానిపై శుక్ర‌వారం కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు టీడీపీ చీఫ్ , సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.