జగన్ రెడ్డి పాపం పండింది
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశాడని ధ్వజమెత్తారు. దోచు కోవడం, దోచుకున్న దానిని దాచు కోవడానికే తన పాలనా కాలాన్ని వినియోగించాడని ఆరోపించారు.
జగన్ రెడ్డి చేసిన పాపాల గురించి చెప్పాలంటే ఒక ఏడాది కూడా సరి పోదన్నారు నారా చంద్రబాబు నాయుడు. అబద్దాలను నిజాలుగా నమ్మించి తన మీడియా ద్వారా ప్రజలను ఇంత కాలం నమ్మించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. అందుకే ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు.
అయినా జగన్ రెడ్డికి బుద్ది రావడం లేదన్నారు. పదవ తరగతిలో పేపర్లు కొట్టేసి , పోలీసులకు దొరికి, థర్డ్ డిగ్రీ తీసుకున్న చరిత్ర నీదని అన్నారు. తినే అన్నం పళ్లాన్ని కాలుతో తంతే, నీ సైకోతనం భరించలేక, మీ నాన్న నిన్ను బెంగుళూరు గెంటేసిన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.
నీ విలాసాల కోసం, మీ నాన్న ఇల్లు అమ్ము కోవటానికి, తన వద్దకు వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ కాళ్ళు నువ్వు పట్టుకుంటే, పెద్దిరెడ్డి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.