జగన్ బొమ్మల ఖర్చు రూ. 700 కోట్లు
నిప్పులు చెరిగిన ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకు పోయిందని ఆరోపించారు. ఆయన రెవిన్యూ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా జగన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలను పూర్తిగా తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ ముద్ర మాత్రమే ఉంటుందని అన్నారు.
ఇక కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పక పోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారని మండిపడ్డారు. మాజీ సీఎం బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోందని అన్నారు సీఎం. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలిక అంచనా వేశారని చెప్పారు .
జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని గుర్తించా. మన్నారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించు కోవాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు సీఎం.