NEWSANDHRA PRADESH

పిల్ల‌లు మొబైల్స్ కు దూరంగా ఉండాలి

Share it with your family & friends

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సూచ‌న
అమ‌రావ‌తి -విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం వైఎస్సార్ క‌డ‌ప జిల్లా బాప‌ట్ల‌లో ప‌ర్య‌టించారు. మున్సిప‌ల్ హైస్కూల్ లో నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.

టెక్నాల‌జీ మారుతోంద‌ని, చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, విద్య‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. విద్య‌తోనే వికాసం క‌లుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థుల‌తో, పేరెంట్స్ తో ముచ్చ‌టించారు. వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకున్నారు. చ‌క్క‌గా సీఎం నోట్స్ రాసుకున్నారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక విద్యాభివృద్దిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌ధానంగా మొబైల్స్ ఇవాళ కీల‌కంగా మారాయ‌ని, వాటి నుంచి మంచి ఉంది..చెడు కూడా ఉంద‌న్నారు. పేరెంట్స్ పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు .

పిల్ల‌ల అభివృద్ది అనేది గురువుల మీదే కాకుండా వారిని క‌న్న పేరెంట్స్ పై కూడా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు.