పాలనలో చంద్రబాబు నాకు స్ఫూర్తి
ప్రశంసించిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పల్లె పండుగను ప్రారంభించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ జరిగిన సభలో ప్రసంగించారు.
ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆకాశానికి ఎత్తేశారు. ఆయన అంతటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకుడు ఎవరూ లేరన్నారు. ఆపై తనే తనకు స్పూర్తి పాలనా పరంగా అంటూ కొనియాడారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
రాజకీయాల్లో గెలవటం వేరు, పరిపాలన వేరు. పరిపాలన ఎలా చేయాలి అనే దానిపై తాను చంద్రబాబు నాయుడు నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు.
మన రాష్ట్రానికి చాలా బలమైన అనుభవం ఉన్న వ్యక్తుల నాయకత్వం కావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అపారమైన పరిపాలనా అనుభవం రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగ పడుతుందని అన్నారు కొణిదెల పవన్ కళ్యాణ్.