ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లా – ప్రజల సంక్షేమానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వం ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అన్నింటిని వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. పెన్షన్ల పంపిణీ అనేది సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఓ వైపు ఆర్థిక పరంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేక పోయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పడి రూ. 2,731 కోట్ల రూపాయలను పెన్షన్ దారులకు అందజేయడం జరిగిందని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన నిర్వాకం కారణంగా రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సర్కార్ ను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా గత సర్కార్ చేసిన పనులు, అవినీతి, అక్రమాల గురించి ప్రత్యేకంగా శ్వేత పత్రాలను విడుదల చేయడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఆరు నూరైనా సరే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీఎం.