దళిత వర్గాలకు ఆర్థిక భద్రత
సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో దళిత వర్గాలకు సంబంధించి ఏం చేస్తే వారు బాగు పడతారనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా దళిత వర్గాలకు మేలు చేకూర్చేలా ఆర్థిక పరంగా భరోసా ఇచ్చేలా పథకాలు, కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోందనే దానిపై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం. ఈ కీలక సమావేశంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి , ఉన్నతాధికారులు హాజరయ్యారు. కీలక సూచనలు చేశారు ఏపీ సీఎం.
తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్ని ఇక్కట్లు పడినా , ఎన్ని కోట్లు అయినా సరే దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామని కుండ బద్దలు కొట్టారు.