మొక్క నాటండి తల్లి పేరు పెట్టండి – సీఎం
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటికి తమ తల్లి పేరు పెట్టాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం వనమహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్బంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొక్కలు నాటారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని మొక్కలు పెంచితే వారికి మంచి బహుమతి ఇస్తామని కూడా పేర్కొన్నారు సీఎం.
రాను రాను ప్రకృతి కుచించుకు పోతోందని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇతర దేశాలకు చెందిన మొక్కలు కాకుండా మన దేశానికి, మన ప్రాంతానికి చెందిన మొక్కలనే విరివిగా నాటాలని కోరారు సీఎం.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికగా చేపట్టాలన్నారు.