సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు కల అని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తన ధ్యేయం ఒక్కటేనని సంపద సృష్టించడం పేదరికం లేకుండా చేయడమని అన్నారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఏపీని సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. ఒకే రోజు 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. ఆనాడు పేదల కోసం ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు.
ఆనాడు పెన్షన్ కేవలం రూ. 200 మాత్రమే ఉండేదన్నారు. కానీ తాము ప్రజా నాయకుడు, దివంగత ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 2000 పెంచడం జరిగిందన్నారు.
జగన్ సర్కార్ ముక్కుతూ మూలుగుతూ రూ. 3000 చేస్తే దానిని మరో రూ. 1000 పెంచి మొత్తం రూ. 4000 చేయడం జరిగందన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతున్నా లెక్క చేయకుండా పేదల సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాలను ఆదుకునేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం.