NEWSANDHRA PRADESH

రాష్ట్ర అభివృద్దిలో సౌర శ‌క్తి కీల‌కం – సీఎం

Share it with your family & friends

ఏపీ స‌ర్కార్ తో అవ‌గాహ‌న ఒప్పందం

అమరావ‌తి – రాష్ట్ర అభివృద్దిలో సౌర శ‌క్తి కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ‌చ్చే 2025 సంవ‌త్స‌రం నాటికి ప్ర‌తి ఇంటిపై సోలార్ ప్యానల్ ల‌ను అమ‌ర్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దీనిపై ఎక్కువ‌గా త‌మ కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారిస్తుంద‌ని చెప్పారు.

దీన్ని సులభతరం చేయడానికి, విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ (NVVN), న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (NREDCAP) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

సౌరశక్తికి మారడం వల్ల విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు. 25 సంవత్సరాల ఒప్పందం వ‌ల్ల సౌర విద్యుత్ ఖర్చు తక్కువగా ఉండేలా చేస్తుంద‌ని, దీర్ఘ కాలంలో పెద్ద పొదుపున‌కు దారి తీస్తుందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వ భవనాల్లో 300 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌లను అమలు చేయడం ద్వారా దాదాపు ఏపీ స‌ర్కార్ కు రూ. 118.27 కోట్లు మిగులుతుంద‌న్నారు సీఎం.