Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHసూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తున్నాం

సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తున్నాం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

ఇచ్చిన మాట ప్ర‌కారం సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దీపం పథకం కింద పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు. 48 గంటల్లో లబ్ధిదారులకు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నామ‌ని చెప్పారు.

ఇందుకోసం రూ.2,684 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు తెలిపారు. కోటిమంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా 93 లక్షలమందికి గ్యాస్ సిలిండర్లు అందించామ‌ని వెల్ల‌డించారు. సమైక్యాంధ్రలో తాను దీపం పథకం తెచ్చానని , ఆడబిడ్డలకు ఇబ్బంది లేకుండా వంటగ్యాస్ ఇస్తున్నామ‌న్నారు.

మంగ‌ళ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు. ప్ర‌జ‌లకు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌జా దేవాల‌యం లాంటి అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వైసీపీ నేత‌లు బాయ్ కాట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వారికి డెమోక్ర‌సీ ప‌ట్ల గౌర‌వం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ ల‌క్ష‌ల కోట్ల‌ను అప్పుగా మిగిల్చింద‌ని, వ‌డ్డీలు క‌ట్టేందుకే వేల కోట్లు కావాల్సి వ‌స్తోంద‌న్నారు. అయినా ఆరు నూరైనా స‌రే అన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments