ఏపీ సర్కార్ కు సహకరించాలి
ఢిల్లీ – ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాల గురించి చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా షేర్ చేశారు చంద్రబాబు. ఆయనతో భేటీ కావడం ఫలప్రదంగా ముగిసిందన్నారు. ఏపీకి టెక్నాలజీ పరంగా సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగిందన్నారు. ఇందుకు బిల్ గేట్స్ కూడా సానుకూలంగా స్పందంచారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం గో ఏపీ , గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించ వచ్చనే దానిపై విస్తృతంగా చర్చించడం జరిగిందని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవా బట్వాడాను మెరుగు పరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని అన్వేషించడం జరిగిందన్నారు.
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు సీఎం. గేట్స్ ఫౌండేషన్‌తో ఈ భాగస్వామ్యం ప్రజలను శక్తివంతం చేయడంలో కీలక పాత్రను పోషిస్తుందన్నారు .