తుంగభద్ర డ్యామ్ గేట్ ను పునరుద్దరించండి
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి 19వ నెంబర్ గేట్ కొట్టుకు పోవడంపై స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆదివారం ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం. తుంగభద్ర డ్యామ్ వద్ద ప్రత్యామ్నాయంగా, అత్యవసరంగా గేట్లను తయారు చేయాలని అన్నారు. తాత్కాలికంగా నీటిని నిలిపేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్బంగా అధికారులు సీఎంకు వివరించారు.
ఇదిలా ఉండగా ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు చంద్రబాబునాయుడు.. అన్ని మార్గాలను అన్వేషించి ప్రభుత్వం డ్యామ్ నుంచి నీటిని వృధా కాకుండా ఆపే ప్రయత్నం చేస్తుందన్నారు. స్టాప్ లాగ్ గేట్ అలైన్మెంట్ డిజైన్ లేక పోవడం వల్లనే ఇలా జరిగిందన్నారు సీఎం.
ఇదిలా ఉండగా ఎగువన భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వరద ఉధృతి దెబ్బకు గేట్ కొట్టుకు పోయింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.