అమరజీవి పొట్టి శ్రీరాములు
సీఎం చంద్రబాబు నివాళులు
అమరావతి – ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి కోసం రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణత్యాగం చేసిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అందుకే పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారని అన్నారు. ఆయన వల్లనే ఏపీ రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసుకోవడం వల్లనే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్దించిందని లేక పోతే వచ్చి ఉండేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు నిత్య ప్రాతః స్మరణీయుడని కొనియాడారు. ఆయన స్పూర్తి ఆంధ్ర జాతికి దిక్సూచి అన్నారు.
గత ప్రభుత్వం పట్టించు కోలేదని అన్నారు. కానీ తమ కూటమి ప్రభుత్వం వచ్చాక కీలక నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిసెంబర్ 15న ఆత్మార్పణ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని స్పష్టం చేసిందన్నారు. ఆయన అందించిన స్పూర్తి ఎల్లకాలం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.