మన్మోహన్ సింగ్ కు చంద్రబాబు నివాళి
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడని కితాబు
ఢిల్లీ – మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. సింగ్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛ ఉంచి అంజలి ఘటించారు. కుటుంబీకులకు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. లెక్చరర్ నుంచి ప్రధాని వరకు సాగిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారత నిర్మాణంలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
దేశం ఆర్థిక శక్తిగా మారిందంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలేనని అన్నారు. ఇదిలా ఉండగా సింగ్ తన కెరీర్ లో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ప్రపంచంలో అత్యున్నతమైన ఆర్థికవేత్తలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నారు.
1982-1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాజ్య సభ సభ్యుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తన పాత్ర నిర్వహించారు డాక్టర్ మన్మోహన్ సింగ్.
ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలకు గాను 1987లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. అంతే కాదు 1993లొ ఉత్తమ ఆర్థిక మంత్రిగా అవార్డు అందుకున్నారు. 2017 మన్మోహన్ సింగ్ కు ఇందిరా గాంధి దక్కింది. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు యావత్ భారత జాతి మొత్తం వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.