ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఢిల్లీ – సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ మోడీ తీసుకు వచ్చిన వికసిత్ భారత్ లో భాగమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు. ప్రధాని నాయకత్వంలో భారత్ వెలిగి పోతోందని చెప్పారు. అన్ని రంగాలలో దేశం ముందుకు వెళుతోందన్నారు.
వర్క్ ఫ్రమ్ హోం అనేది అంతటా మంచి అవకాశంగా మారుతోందన్నారు. వికసిత్ భారత్ ను 2047 లోపు సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు సీఎం. ఢిల్లీలో బీజేపీ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని, ఆ నమ్మకంత తనకు ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.
ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పాలన పట్ల విసుగు చెందారని ఆరోపించారు. ప్రస్తుతం కమలం దూకుడు మీద ఉందన్నారు. ఇక దేశంలో కూటమి హవా కొనసాగుతోందని, అదే జోరు హస్తినలో ప్రతిఫలించడం ఖాయమని స్పష్టం చేశారు సీఎం.
అన్ని వర్గాలకు న్యాయం చేసే సత్తా ఒక్క మోడీకే ఉందన్నారు. ఆయన నాయకత్వంలో భారత్ దుమ్ము రేపుతోందన్నారు నారా చంద్రబాబు నాయుడు.