ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ – ఎకానమీ సృష్టికి చిరునామాగా తెలుగు జాతి ఉంటుందని, నాలెడ్జ్ ఎకానమీ, ఆంట్రప్రెన్యూర్‌లో తెలుగు వారు ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్ని జన్మలైనా తాను తెలుగుజాతిలోనే పుట్టి సేవ చేయాలని కోరుకుంటున్నాని అన్నారు. హైదరాబాద్‌లో కంఠంనేని రవిశంకర్‌కు చెందిన తెలుగు వన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవంలో పాల్గొన్నారు. డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందన్నారు. నేను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకు వెళుతున్నారని అన్నారు.
ఒకప్పుడు ఆకాశవాణి తప్ప ఏమీ ఉండేవి కాదు. తర్వాత వార్తా పత్రికలు వచ్చాయి. సమాజంలోకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. 2003లో అలిపిరిలో నాపై మావోయిస్టులు దాడి చేశారు. అప్పుడు ఒక్క జెమినీ మాత్రమే ఉంది..కానీ ఇప్పుడు అనేకం ఉన్నాయి. చాలా మంది అనేక ఛానల్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే కూర్చుని ఛానల్ పెట్టుకునే ఆదాయాన్ని కూడా పొందే అవకాశం వచ్చిందన్నారు. న్యూస్ పేపర్‌కు సర్య్కులేషన్, శాటిలైట్ ఛానల్‌కు టీఆర్పీ, య్యూటూబ్ ఛానల్‌కు వ్యూస్, సబ్‌స్క్రైబ్స్ ఉంటాయి. తెలుగు వన్ ఛానల్ ఇప్పటి వరకు 55 బిలియన్ వ్యూవ్స్, 120 మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 16 లక్షల వీడియాలను, 15 వందలకు పైగా సినిమాలు ఉన్నాయి. తిరుగులేని శక్తిగా తెలుగువన్ తయారైందన్నారు.