ఏపీకి బాబు బ్రాండ్ అంబాసిడర్
మంత్రి టీజీ భరత్ షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి పునర్ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు డైనమిక్ లీడర్ గా పేరు పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన రూటే సపరేట్. అంతే కాదు నిత్యం అభివృద్ది మంత్రం జపిస్తూ ఉంటారు. తాను పని చేస్తూ ఇతరులను పరుగులు పెట్టిస్తూ ఉంటారు. ఆయన సీఎం అయ్యాక మరింత స్పీడ్ పెంచారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకు వచ్చే పనిలో పడ్డారు. అంతే కాదు ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొల్పే పనిలో పడ్డారు నారా చంద్రబాబు నాయుడు.
గత 5 ఏళ్లుగా పాలించిన వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని , దాని నుంచి గట్టెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీకి పలుమార్లు వెళ్లారు. సంపదను సృష్టించడం..ఉపాధి కల్పించడం అనే నినాదంతో ఏపీని అన్ని రంగాలలో ముందంజలో నిలిపేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు ఏపీ సీఎం.
ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తమ రాష్ట్రానికి రియల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు తమ నాయకుడు , సీఎం నారా చంద్రబాబు నాయుడే నంటూ కితాబు ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే సీఎం మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందంజలో ఉన్నారు. అందరికంటే ముందు చూపుతో దూసుకు వెళుతున్నారు.