2025 డైరీని ఆవిష్కరించిన సీఎం
తెలుగు ప్రముఖులతో క్యాలెండర్
అమరావతి – ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్, డైరీని తయారు చేసింది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర సచివాలయంలో 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ , డైరీని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
సీఎంతో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు , సీఎస్ నీరబ్ కుమార్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా తయారు చేశామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకునే విధంగా కేలండర్ డిజైన్ చేయడం జరిగిందని తెలిపారు. క్యాలెండర్, డైరీలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఎంతగానో ఉపయోగ పడతాయని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
వీటిని రూపొందించినందుకు గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు సీఎం.