ఏపీ అప్పు రూ.9,74,556 కోట్లు
సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వాకాన్ని , ఆయన అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. శుక్రవారం శాసన సభ సాక్షిగా రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి అంకెలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి ఒక్కో శాఖకు సంబంధించి శ్వేత పత్రాలను (వైట్ పేపర్స్ ) విడుదల చేస్తూ వస్తున్నారు.
ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి గణాంకాలను రిలీజ్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా మొత్తం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 9, 74, 555 కోట్ల అప్పు ఉందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
వీటిలో ఇంకా కార్పొరేషన్ రుణాలు, ఇతర శాఖల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉందని స్పష్టం చేశారు. వాటి నుంచి వస్తే ఈ అప్పు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో దోచు కోవడం, దోచుకున్నది దాచు కోవడం, ఏమని ప్రశ్నిస్తే కేసులను నమోదు చేయడం పనిగా పెట్టుకుని జగన్ రెడ్డి దౌర్జన్య పాలన సాగించారని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.