నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం సమీక్ష
నియంత్రణ ఉండేలా చూడాలని ఆదేశం
అమరావతి – రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం సీఎం రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖలపై సమీక్ష చేపట్టారు.
ఈ సమీక్షా కార్యక్రమానికి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వాటిపై నియంత్రణ అనేది ఉండాలని పేర్కొన్నారు సీఎం.
ఈ సందర్బంగా పౌర సరఫరాల శాఖ తీసుకున్న చర్యల గురించి నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. డిమాండ్ కు తగిన విధంగా నిత్యావసర వస్తువుల దిగుమతిపై కూడా ఫోకస్ పెట్టాలని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో విక్రయిస్తున్న నిత్యావసర సరుకులపై కూడా నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సాధ్యమైనంత వరకు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం. ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు.