NEWSANDHRA PRADESH

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌రిస్థితిపై స‌మీక్ష

Share it with your family & friends

పాల్గొన్న మంత్రులు..ఉన్న‌తాధికారులు

విజ‌యవాడ – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విరామం అన్న‌ది లేకుండా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న గ‌త రాత్రి నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిస్థితిపై ఆరా తీస్తున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు స‌రిగా చేస్తున్నారా లేదా అన్న దానిపై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

సోమ‌వారం బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు . మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులను ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఆహార పంపిణీ ఎంత మేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. ఇదే స‌మ‌యంలో బాధితుల కోసం ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారం పై కూడా ఆరా తీశారు.

పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని కోరారు సీఎం. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. స‌మ‌స్య‌ను రెండు మూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాల‌న్నారు.