నిత్యావసర వస్తువుల పంపిణీపై ఆరా
సమీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రత కారణంగా జన జీవనం స్తంభించి పోయింది. దీంతో ఇంకా చాలా కాలనీలు, గ్రామాలు నీళ్లలోనే ఉన్నాయి. ఈ సందర్బంగా ముందు జాగ్రత్తగా ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రధానంగా బాధితులకు ఎలాంటి లోటు రాకూండా చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు .
శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాలలో చోటు చేసుకున్న పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు. నిత్యావసరాతో కూడిన 6 వస్తువుల పంపిణీ పైనా వాకబు చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్దం చేశారు అధికారులు.
వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని ఆదేశించారు సిఎం. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్ లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని సూచించారు.
కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు సీఎం.. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.