Friday, April 11, 2025
HomeNEWSNATIONALఐటీలో సంచ‌ల‌నం ఏఐదే రాజ్యం

ఐటీలో సంచ‌ల‌నం ఏఐదే రాజ్యం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

ఢిల్లీ – సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు టెక్నాల‌జీ రంగంపై. రోజు రోజుకు సాంకేతిక‌తంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఏఐ రాక‌తో క‌ష్ట‌త‌ర‌మైన ప‌నుల‌న్నీ సుల‌భంగా మారి పోతున్నాయ‌ని అన్నారు. 20 ఏళ్ల కింద‌ట‌నే తాను ఐటీ ప్రాధాన్య‌త గుర్తించాన‌ని చెప్పారు. అందుకే హైద్రాబాద్ ను ఐటీకి కేరాఫ్ గా మార్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ఐటీలో మాత్రం ప్ర‌స్తుతానికి ఏఐ రాజ్యమేలుతోంద‌న్నారు.

వికసిత్ భారత్‌కు కేంద్ర బడ్జెట్‌తో బాటలు వేసింద‌న్నారు. ఢిల్లీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. గత విధ్వంస పాలనతో 30 ఏళ్లు ఏపీకి వెనుక‌బ‌డి పోయింద‌న్నారు. 15 శాతం వృద్ది రేటు ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు సీఎం. ఢిల్లీలో ఎక్క‌డ చూసినా చెత్తా చెదారం పేరుకు పోయింద‌న్నారు.

పాల‌నా ప‌రంగా వైఫ‌ల్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆరోపించారు. బీజేపీ గెలుపుతోనే అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ‘వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేలా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కితాబు ఇచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్‌లా ఉందన్నారు.

ఇప్పటికే ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments