NEWSANDHRA PRADESH

రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం కొత్త ప్లాన్స్

Share it with your family & friends

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ – రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పది పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెట్రో రైల్‌, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదల, రైతు సాధికారత, ఆదాయం పెంపులో నంబర్‌ వన్‌ కావాలన్నారు. ప్రపంచస్థాయి మౌలికవసతుల అభివృద్ధిలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు.

స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేయాలని అధికారులకు చెప్పారు. అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలో మనమే నంబర్‌ కావాలన్నారు. పీ-4 విధానంలో సంపద సృష్టిద్దామని.. ఇందుకోసం డబ్బుకంటే మంచి ఆలోచనే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.

తెలుగు వారు ఎక్క‌డున్నా ఏపీ అభివృద్ది కోసం సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని సూచించారు ఏపీ సీఎం.