గ్రౌండ్ వాటర్ పై దృష్టి పెట్టండి
సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ నిల్వ పెంచేందుకు దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని జిల్లాల కలెక్టర్లు నీటి సంరక్షణ కోసం ప్లాన్స్ తయారు చేయాలని ఆదేశించారు. రాబోయే రెండు సీజన్లు అత్యంత ముఖ్యమన్నారు.
రైతులు సాగు చేసేందుకు అవసరమైన నీటిని అందించే బాధ్యత మనపై ఉందన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ కనకదర్గమ్మ , శ్రీశైల మల్లన్న దీవెనలతో ఏపీకి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయని అన్నారు సీఎం.
దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని తెలిపారు చంద్రబాబు నాయుడు. వర్షపాతం బాగుంది గనుక గ్రౌండ్ వాటర్ బాగుందన్నారు.. ఒకటి ఉపరితల నీరు, రెండు అండర్ గ్రౌండ్ వాటర్.. వాటర్ రీఛార్జి మీద దృష్టి ప్రత్యేకంగా జిల్లాల కలెక్టర్లు ఫోకస్ పెట్టాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు.
రాబోయే రెండు సీజన్లలో ప్రతీ జిల్లాలో వానాకాలం నాటికి 8 మీటర్ల నీటి నిల్వ ఉండాలని అన్నారు.. పోలవరం పూర్తయ్యే లోపే పోలవరం నుంచి కృష్ణకు నీరు తీసుకు రావాలన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చే ఏడాదికి విశాఖ వరకు వస్తుందన్నారు.