ఆయన మరణం బాధాకరం
అమరావతి – భారత దేశం గర్వించ దగిన వ్యక్తులలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ఒకరు. ఆయనతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఇవాళ రతన్ టాటా లేరన్న వార్తను నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఇది అత్యంత విషాదకరమని పేర్కొన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు.
రతన్ టాటతో ఎన్నోసార్లు భేటీ అయ్యాను. ఎన్నో ఆయన నుంచి నేర్చుకున్నానని తెలిపారు. చాలా సూచనలు చేశారు. మరెన్నో ప్రతిపాదనలు ముందుంచారు. రతన్ టాటా అత్యంత సానుకూల దృక్ఫథం కలిగిన వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు శక్తి. ఒకటా రెండా అనేక సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా వేలాది మందికి నీడను కల్పించిన మహోన్నత మానవుడు అని కొనియాడారు.
రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దార్శనికత, చిత్తశుద్ధి ఎందరినో ప్రభావితం చేసింది. ఆయన వ్యాపార పరంగా టైకూన్ మాత్రమే కాదు..నిజమైన మానవతా వాది అని కొనియాడారు. దాతృత్వం దేశ నిర్మాణానికి దోహద పడిన తీరు ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుందని పేర్కొన్నారు సీఎం.